🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Eluka Gurrama Meeda

PadyaluVijaya Vipanchi7.6k plays
Languages:
Telugu
PDF
ఎలుక గుఱ్ఱము మీద నీరేడు భువనాలు పరువెత్తివచ్చిన పందెకాడు ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో పెత్తనమ్మొనరించు పెద్దకొడుకు నల్ల మామా యంచు నారాయణుని పరి యాచకాలాడు మేనల్లు కుఱ్ఱ వడకుగుబ్బలి రాచవారిబిడ్డ భవాని నూఱేండ్లు నోచిన నోముపంట అమరులం దగ్రతాంబూల మందు మేటి ఆఱుమోముల జగజెట్టి అన్నగారు విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె ఆంధ్రవిద్యార్థి లెమ్ము జోహారు లిడగ తిలకమ్ముగా దిద్దితీర్చిన పూప జా బిలి రేక లేత వెన్నెలలు గాయ చిరుబొజ్జ జీరాడు చికిలి కుచ్చెల చెంగు మురిపెంపు పాదాల ముద్దుగొనగ జలతారు పూలకుచ్చుల వల్లెవాటుతో త్రాచు జందెములు దోబూచులాడ కొలుచు ముప్పదిమూడుకోట్ల దేవతలపై చల్లని చూపులు వెల్లివిరియ గౌరికొమరుడు కొలువు సింగారమయ్యె జాగుచేసినచో లేచి సాగునేమొ తమ్ముడా! రమ్ము స్వామి పాదములు పట్ట చెల్లెలా! తెమ్ము పువ్వుల పళ్ళెరమ్ము కొలుచువారలకు ముంగొంగు బంగారమ్ము పిలుచువారల కెల్ల ప్రియసఖుండు సేవించువారికి చేతిచింతామణి భావించువారల పట్టుగొమ్మ దాసోహ మనువారి దగ్గర చుట్టమ్ము దోసిలొగ్గినవారి తోడునీడ ఆశ్రయించిన వారి కానంద మందార మర్థించు వారల కమృతలహరి జాలిపేగుల వాడు లోకాల కాది దేవుడే మన పార్వతీదేవి కొడుకు చిట్టెలుక నెక్కి నేడు విచ్చేసినాడు అక్కరో! అర్ఘ్యపాత్రము నందుకొనవె లడ్డూ జిలేబి హల్వాలె యక్కరలేదు బియ్యపుండ్రాళ్ళకే చెయ్యిచాచు వలిపంపు పట్టుదువ్వలువలే పనిలేదు పసుపు గోచీకె సంబ్రాలుపడును ముడుపు మూటల పెట్టుబడి పట్టుదలలేదు పొట్టిగుంజిళ్ళకే పొంగిపోవు కల్కి తురాయీలకై తగాదా లేదు గరికపూజకె తలకాయ నొగ్గు పంచకల్యాణికై యల్కపాన్పు లేదు ఎలుక తత్తడికే బుజాలెగురవైచు పంచభక్ష్యాలకై మొండిపట్టు లేదు పచ్చి వడపప్పె తిను వట్టి పిచ్చితండ్రి కుడుము లర్పించు పిల్లభక్తులకు నెల్ల యిడుములం దించి కలిమి లందించు చేయి పార్వతీదేవి ముద్దులబ్బాయి చేయి హైందవేయుల భాగ్యాలు కావు గాక!

Comments

Leave a comment

Related Songs

Ammalaganna Amma

Padyalu51.5k plays

Keshavashtakam

Padyalu14.1k plays

Okacho nelanu - Padyamu

Padyalu11.5k plays

Talli Tandrula - Padyamu

Padyalu9.8k plays

Amba Navaambu

Padyalu6.9k plays