🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Koduka Nannu (Geet on Gow Matha)

JanapadaluVijaya Vipanchi21.5k plays
Languages:
Telugu
PDF
కొడుకా... నను కొతాకమ్మకురా .. కన్ను మూసే దాకా కష్టపడతా నీ కోసం. || కొడుకా|| అవ్వతోని అర్ణమొచ్చిన అయ్యకారు ఎడ్లనిచ్చిన పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్దకాపుగా నిన్ను చేసిన ఇపుడు నేను ముసలినైతిని వట్టిపోయిన గోదనైతిని ||2|| వట్టి కాసుల కోసరము నను కొట్టి చంపే వాళ్ళ కిస్తవ. || కొడుకా|| అల్కబీరోల్లోస్తరంటా ఎక్కువ పైసలిస్తరంటా పైసలాశకు నన్ను నీవు పట్టి వాళ్ళ కప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తరంటా నీళ్ళు మ్యాతా వెట్టరంట ||2|| నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తిని. || కొడుకా|| పెయ్యి మీద సలసలా కాగేటి నీళ్ళు వొస్తరంటా కింద వడ్డా నన్ను మిషిని మీద యాల్లాడేస్తరంటా ప్రాణముండాగానే తోలు వలిసి ఊడా దీస్తరంటా ||2|| సగము గొంతు గోసి రగతము మందులల్ల వొస్తరంటా || కొడుకా|| దేవుడిచ్చిన గడ్డి మేసిన ఎండ వానల పన్లు చేసిన యెనక జనమల కింది బాకీ ఇచ్చిపొ నీ ఇంటికొచ్చిన ఇన్ని నాళ్లు నీ పంచన ఉన్న నాపై జాలి లేదా ||2|| బాంచ నైత కొడుకా నన్నా అరబ్బొల్ల కమ్మవోకు || కొడుకా|| కొడుకా... ..

Comments

Leave a comment

Related Songs

Shakha Chinnadi

Janapadalu12.7k plays

Srikakulam Song

Janapadalu11.6k plays

Lelera Tammuda

Janapadalu11.3k plays