Home
Songs
Articles
Quotes
Contribute
Contact
🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.
Search
Songs
/
Lelera Tammuda
Lelera Tammuda
Janapadalu
Vijaya Vipanchi
11.3k plays
Languages:
Telugu
Print
PDF
QR
Copy link
Share
Tabs
Side by side
Auto-scroll
Telugu
లేలేర తమ్ముడ నువు నిజ చరిత్ర తెలుసుకో లేలేర తమ్ముడ లేలేర తమ్ముడ నువు స్వాభిమానం పెంచుకో లేలేర తమ్ముడ !! హిమాద్రి నుండి హిందుసంద్రము వరకున్న భూమి జగతిలోన వెలిగినది ఉజ్వల భారతమై సింధూ జలాల సాక్షి వేదములే అందించిన హిందువులు చుట్టొచ్చిరి జగమంత చుట్టాలై !! 1 మనకు మనం ఎవరిపైన దండయాత్ర చేయలేదు అలెగ్జాండారాక్రమిస్తె అడవుల తరిమేసినాము సుఖశాంతులనిచ్చుటకై వెలసె రామరాజ్యం కురుక్షేత్ర సంగరాన ధర్మానిదే విజయం !! 2 గుమాస్త చదువులతో వ్యక్తిత్వం చంపుకోకు విలువల విద్యను నేర్చి నిన్ను నీవు దిద్దుకోర ఆంగ్లభాష భావదాస్య దారిద్ర్యం తొలగించు అమ్మ,నాన్న ఇంటి భాష తేనె కంటె తీపిరా !! 3 పరాయి వారార్యులనే ఆర్య ద్రవిడ సిద్ధాంతం దేశ ప్రజల విడదీసే ఆంగ్లేయుల పన్నాగం ఆర్యుడంటె శ్రేష్టుడని అర్థం నువు తెలుసుకో అందరినీ ఆదరించి ఆర్యులుగా మలుచుకో !! 4
Comments
Leave a comment
Name *
Email (optional)
Rating
Comment *
CAPTCHA *
Submit comment
Related Songs
Koduka Nannu (Geet on Gow Matha)
Janapadalu
21.5k plays
Shakha Chinnadi
Janapadalu
12.7k plays
Srikakulam Song
Janapadalu
11.6k plays