అమూర్త మూర్త మూర్తిమంత నీవలె మే మగుదుమయ్యా
దేశ కార్య నిరతి కొరకు నీ చరణమే శరణమయ్య || అమూర్త ||
దివ్య రాష్ట్ర దీప మీవు అనుపమాన దీప్తి నీది
ఆ వెలుగులె మా గుండెలలో వెలుగులు నింపునయ్య || అమూర్త ||
లేదు పూలమాల వలపు కలదాత్మార్పణపు తలపు
ధ్యేయ శిఖల మా స్వార్ధము ఆహుతిగా నగుగదయ్య || అమూర్త ||
నీ సమముగ మే మెదుగగ ఉద్దారితమై నిరతము
దేశ ధర్మ సంస్కృతులు దీప్తి జగతి నిండునయ్య || అమూర్త ||
Comments
Leave a comment
Related Songs
Bhuvan Mandale Navayuga mudayatu Sada Vivekananda mayam