🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Rakshabhandana Sutramide

Utsava GeetaluVijaya Vipanchi16.6k plays
Languages:
Telugu
PDF
రక్షాబంధన సూత్రమిదే - హిందూ జీవన మంత్రమిదే ఈ జగమంతా ఈశ్వర నిలయం - ఏకాత్మతయే సృష్టి రహస్యం ||రక్షా బంధన|| కార్మికులైనా కర్షకులైనా - పదవీ గౌరవ భాజనులైనా భారతమాతా సంతానం - హిందువులంతా ఏక కుటుంబం ||రక్షా బంధన|| స్వార్థం, మోసం, పరమత ద్వేషం - హింసా, క్రౌర్య దానవ శక్తులు పరోపకారం సమాన భావం - త్యాగం సేవా దైవీ శక్తులు ||రక్షా బంధన|| భోగవాదమును, భావ దాస్యమును - పరపీడనమును పారగ ద్రోలుము సకల సంపదలు జగదీశునివే - అర్థ కామముల మూలము ధర్మము ||రక్షా బంధన|| దధీచి మహర్షి త్యాగ సంపద - రామకృష్ణుల దివ్య తపస్సు గౌతమ శంకర కరుణాద్వైతం - వివేకవాణి విశ్వజనీనత ||రక్షా బంధన||

Comments

Leave a comment

Related Songs

Bhuvan Mandale Navayuga mudayatu Sada Vivekananda mayam

Utsava Geetalu29.1k plays

Asetu Seeta nagamu

Utsava Geetalu18.9k plays

Gunde Ninda Dyaeyamunnadi

Utsava Geetalu18.5k plays

Sangha Karya Nirmata

Utsava Geetalu17.7k plays

Veera Keshava Janmame

Utsava Geetalu16.8k plays