Home
Songs
Articles
Quotes
Contribute
Contact
🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.
Search
Songs
/
Dikshadharana
Dikshadharana
Utsava Geetalu
Vijaya Vipanchi
10.2k plays
Languages:
Telugu
Print
PDF
QR
Copy link
Share
Tabs
Side by side
Auto-scroll
Telugu
దీక్షాధారణ శుభోత్సవం - ఇదే రక్షాబంధన మహోత్సవం తరతరాలుగా భారతావనిలో - ధర్మస్థాపనకు నాందిగ నిలిచిన ||దీక్షా|| త్రిపురాసులను దహింపజేసి - దానవ శక్తుల దర్పమడచంగ సాత్విక శక్తుల సంఘటించగా - త్రినేత్రుడే తన త్రిశూలమెత్తి ముందునకురికిన ముహూర్తమిదియే - దీక్షాధారణ శుభోత్సవం ||దీక్షా|| యవనుల దాడుల నెదిర్చి గెలిచి - సీమోల్లంఘన చేయు క్షణముకై చంద్రగుప్త, పురు, చాణక్యాదులు - సర్వశక్తులను సమీకరించగ ప్రారంభించిన పర్వదినంబిదె - దీక్షాధారణ శుభోత్సవం ||దీక్షా|| దేశములోపల ద్వేషాసూయల - ఈర్షాభయముల నిహ సుఖవాంఛల పంచమాంగదళ వంచన చేష్టల - శత్రు ఆక్రమణ శమింప జేయగ హిందూ యువకులు ముందున కురికే - దీక్షాధారణ శుభోత్సవం ||దీక్షా|| స్నేహ ప్రేమలను సూత్రము లోపల - హృదయ పుష్పముల బంధించి సమాజ ధర్మం సమాచరింపగ - ఒకరికి తోడుగ నొకర ముందుమని రక్షల కట్టెడి రమ్య క్షణంబిదె - దీక్షాధారణ శుభోత్సవం ||దీక్షా||
Comments
Leave a comment
Name *
Email (optional)
Rating
Comment *
CAPTCHA *
Submit comment
Related Songs
Bhuvan Mandale Navayuga mudayatu Sada Vivekananda mayam
Utsava Geetalu
29.1k plays
Asetu Seeta nagamu
Utsava Geetalu
18.9k plays
Gunde Ninda Dyaeyamunnadi
Utsava Geetalu
18.5k plays
Sangha Karya Nirmata
Utsava Geetalu
17.7k plays
Veera Keshava Janmame
Utsava Geetalu
16.8k plays
Rakshabhandana Sutramide
Utsava Geetalu
16.6k plays