విజయదశమి
దుష్ట శక్తి సంహారం జరిగిన నాడు
శిష్ట జనులు విజయ గీత పాడిన నాడు /ప/
జమ్మి చెట్టు పైన దాచి పెట్టిన శస్త్రాలను
గో రక్షణ కోసమై మరలా పట్టుకున్న రోజు
బద్ధకములో దాగివున్న శౌర్య ధైర్య సాహసమును
దేశ ధర్మ రక్షణకై వెలికి తీసే రోజు /౧/
అసుర శక్తి పైన జయము సాధించిన రాముడు
యుద్ధములో దశకంఠుని హతమార్చిన నాడు
సామాజిక రుగ్మతలను సమూలంగా నివారించి
సమ సమాజ నిర్మితికై ప్రతినబూనే రోజు /౨/
శతాబ్దాల భారతీయ దాస్యానికి మూలం
తరతమ భేదాలతో లోపించిన ఏకత్వం
శక్తిశాలి హిందు రాష్ట్ర నిర్మాణమే గమ్యమై
కేశవుడు పునాది వేసిన నాడు /౩/
Comments
Leave a comment
Related Songs
Bhuvan Mandale Navayuga mudayatu Sada Vivekananda mayam