జయ మహావీర జయ శివ రాజా
జయ భారత జన మనో విరాజా
||జయ మహావీర||
విదేశీయ పరిపాలన యందు మ్రగ్గుచుండి జనులాశలు వీడి
ధర్మత్రాతవై జాతి నేతవై ధరణి గాంచిన ఓ యుగపురుషా
జయ మహావీర జయ శివ రాజా
జయ భారత జన మనో విరాజా
కొండల కోనల ప్రజలను కలిపి స్వేచ్ఛా జీవన శంఖమునూది
సంఘటనముతో శక్తిని నింపిన మహావీర ధీరోత్తమ పురుషా
జయ మహావీర జయ శివ రాజా
జయ భారత జన మనో విరాజా
క్షాత్ర శౌర్యమే హృది దీపముగా సార్వభౌమమే ప్రాప్తించిననూ
రామదాసుకే రాజ్యమునంతా ధారవోసిన ధార్మిక పురుషా
జయ మహావీర జయ శివ రాజా
జయ భారత జన మనో విరాజా
Comments
Leave a comment
Related Songs
Bhuvan Mandale Navayuga mudayatu Sada Vivekananda mayam