🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Maa Jeevana Sardakyam

Utsava GeetaluVijaya Vipanchi10.8k plays
Languages:
Telugu
PDF
మా జీవన సార్ధక్యం మాతృదేశ నిర్మాణం తనువు మనసు ధనము శక్తి తల్లికే సమర్పణం || మా జీవన || దేశభక్త దేశరత్న దేశోద్ధారక బిరుదులు ఆశించం లేశమైన అలసులమై నిదురించం మాతృదేశ ప్రాభవమే మనసారగ కోరుతాం కర్మమయము జీవనమై క్షణక్షణం గడుపుతాం || మా జీవన || జాతిని నీరసపరిచే దుర్నీతిని తొలగిస్తాం మతముల మాటున దాగిన దుర్మార్గం వెలివేస్తాం పెడదారిని పడిపోయే బంధుల దారికి తెస్తాం మమత పంచి సమత పెంచి సమాజాన్ని సేవిస్తాం || మా జీవన || ధర్మరహిత రాజ్యశక్తి దౌష్ట్యాలను అరికడతాం స్వార్ధకీటకాల పీడ శాశ్వతంగ వదిలిస్తాం దారిద్ర్యం అజ్ఞానం దమన కాండలకు నలిగీ జీర్ణమైన దేశానికి పూర్ణ జీవనము నిస్తాం || మా జీవన || విధర్మాల వేరు పురుగు విజాతీయ విష వలయం కుహనా మేధావులోసగు కూట నీతి గరళం అణగిపోవ వర్షిస్తాం అనురాగపుజల్లు దాహశాంతి కందిస్తాం ధర్మజ్ఞాన జలాలు || మా జీవన ||

Comments

Leave a comment

Related Songs

Bhuvan Mandale Navayuga mudayatu Sada Vivekananda mayam

Utsava Geetalu29.1k plays

Asetu Seeta nagamu

Utsava Geetalu18.9k plays

Gunde Ninda Dyaeyamunnadi

Utsava Geetalu18.5k plays

Sangha Karya Nirmata

Utsava Geetalu17.7k plays

Veera Keshava Janmame

Utsava Geetalu16.8k plays