మంచు శిఖరపంచునుంచి
సాగరమున సేతు వరకు
హిందూ జన మానసములో
ఐకమత్య భావని
మేల్కొలిపే కేతనము
గురువుకు ప్రణామము /ప/
దేశభక్తి జాగృతికి
ప్రేరణయే ఈ ధ్వజం
అగ్ని జ్వాల రూపములో
దుష్ట శక్తి దహనము
త్యాగశీలవంటి గుణము
నేర్పే కాషాయము /1/
అజ్ఞానపు అంధకారం
తుడిచివేసే అరుణవర్ణం
విఘటిత సమాజమును
సంఘటించే శక్తిరూపం
హిందు రాష్ట్ర నిర్మితికై
గురువు భగవాధ్వజం /2/
Comments
Leave a comment
Related Songs
Bhuvan Mandale Navayuga mudayatu Sada Vivekananda mayam