🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Rakshele Kattukundamu

Utsava GeetaluVijaya Vipanchi9.7k plays
Languages:
Telugu
PDF
రక్షలే కట్టుకుందాం - ఈ రోజు దీక్ష గైకొని సాగుదాం దీక్ష గైకొని సాగుదాం - ఈ రోజు రక్షలే కట్టుకుందాం ||దీక్ష || మనము పుట్టిన గడ్డ మహనీయమైనదే మునులు దేవతలనే మురిపించు తావిదే మన శక్తి లేమిచే - జవ సత్వములు బాసి దిన దినము కృశియించి కృంగి పోవుచునుండ ||దీక్ష || తన సుఖము కొరకొరుల హింసించు ప్రవృత్తి తనివి తీరగ జనుల పీడించు దుర్వృత్తి మనము మన వారనే మాట మరచుట చేత స్వ సమాజ సంక్షేమ మణగారి పోతుండ ||దీక్ష || ప్రేమానురాగాలు పంచుకుందాము గాడానుబంధాలు కూర్చు కుందాము కలిమిలో లేమిలో కలకాల మిలలో చెలిమి విడనాడమని చేయి ముందుకు చాచి ||దీక్ష ||

Comments

Leave a comment

Related Songs

Bhuvan Mandale Navayuga mudayatu Sada Vivekananda mayam

Utsava Geetalu29.1k plays

Asetu Seeta nagamu

Utsava Geetalu18.9k plays

Gunde Ninda Dyaeyamunnadi

Utsava Geetalu18.5k plays

Sangha Karya Nirmata

Utsava Geetalu17.7k plays

Veera Keshava Janmame

Utsava Geetalu16.8k plays