🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Jayamu Jayamu bharata Mata

PatrioticVijaya Vipanchi83k plays
Languages:
Telugu
PDF
జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి యెవ్వరే ఓయమ్మ నీకు || జయము || గంగ యమున గోదారీ సింధు కృష్ణ కావేరీ బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతీ నర్మద పెన్నా పొంగి పొరలె తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల గన్నతల్లివే ఓయమ్మ నీవు || జయము || హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు నిజముగ నువు రత్గర్భవే ఓయమ్మ నీవు || జయము || లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికితెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు నిజముగ నువు జగద్గురువువే ఓయమ్మ నీవు || జయము ||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays

Ekatmata Stotram

Patriotic58.3k plays