🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

a aa ganesha gam gam ganesha

DevotionalVijaya Vipanchi1.8k plays
Languages:
Telugu
PDF
1.అమ్మ నాన్నకు భక్తి తో మొక్కి ఆనందంతో ఎలుకను ఎక్కి ఇంటా బయట పూజలు పొందగ ఈశ్వర పుత్రుడు వచ్చిండు 2.ఉండ్రాళ్ళు సిద్ధం చేద్దాం ఊరందరినాహ్వానిద్దాం ఋషులు మునులు సంతసించగా ఎదలో గణపతి పూజిద్దాం 3.ఏనుగు తల తో వచ్చిండు ఐశ్వర్యం మనకిచ్చిండు ఒంటి కాలితో నాట్యం చేస్తూ ఓహో గణేశ రారా యనగా ఔరా యంటూ చూడంగా అంబ పార్వతితో వచ్చిండు అహంకారమణిచేసిండు 4.కడుపారా పాయసం త్రాగి ఖర్జుర పండ్లనే మెచ్చిండు గడ్డి పరక ఉంచి గుంజీలు తీస్తే ఘనంగా దీవెనలిచ్చిండు జ్ఞానమందరికిచ్చిండు 5.చవితి నుండి తొమ్మిది రాత్రులు ఛత్రం ఎత్తి అర్చన చేద్దాం జన్మ జన్మల పుణ్య ఫలంతో ఝంకారంతో గానం చేద్దాం 6.టక్కరి గాళ్ళను మట్టుబెట్టి ఠంఠమ్మని గంటలు మోగిద్దాం డప్పుల చప్పుడు ఆగకుండ ఢం ఢమ్మని బాజా మ్రోగిద్దాం రణమున గెలుపును సాధిద్దాం 7.తమ్ములు చెల్లెలు సంబరమ్ముతో థకిట థకిట మని నాట్యం చేస్తే దండాల దండలు వేద్దాము ధర్మం కాపాడుకుందాం 8.నచ్చి మెచ్చిన గణపయ్య పరుగు పరుగున వచ్చేనయ్య ఫలములు మెండుగా ఇచ్చేనయ్య బండిని ఎక్కించి ఊరేగిస్తే భవ బంధాలు తొలగెనయా 9.మనసారా గణపతిని వేడంగ యమ బాధలు బాపెను చూడంగ రమ్మని గోంతేత్తి పాడరా లంభోదరా లకుమికరా 10.వరుసగా భజనలు చేసి శరణంటూ గణపతి చేరి సకల లోకాల అధిపతిని షణ్ముఖ నాథుని సోదరుని హరుడి పుత్రుడు గణపతి బొప్పను , క్షమించమంటూ మొక్కుదం ఱయి ఱయి మని సాగనంపుదం

Comments

Leave a comment

Related Songs

Garuda Gamana Tava

Devotional33.8k plays

Namah Parvati Pataye

Devotional27.9k plays

jaya janardhana krishna

Devotional14.6k plays

Vinavamma Urmila

Devotional14.1k plays

Muripaala Gopaala

Devotional12.7k plays