🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Govindudu Ela Raade

DevotionalVijaya Vipanchi12k plays
Languages:
Telugu
PDF
గోవిందుడెలరాడె ఓ కేశవా గోపాలుడెలరాడె గోవిందుడెలరాడె ఓ మాధవా గోపాలుడెలరాడె నల్ల నల్లనివాడె ఓ కేశవా నామాలు కలవాడె పట్టు పుట్టము వాడె ఓ మాధవా నెమలి పింఛమువాడె || గోవిందుడెలరాడె || మత్స్యావతరమున మడుగులోన దాగినాడె మడుగులోన దాగినాడె వేదములు తెచ్చినాడె || గోవిందుడెలరాడె || వరహావతరమున వసుధను ఎత్తినాడె వసుధను ఎత్తినాడె అసురుని చీల్చినాడె || గోవిందుడెలరాడె || కూర్మావతరమున మందరము మొసినాడె మందరము మొసినాడె అమృతము తెచ్చినాడె || గోవిందుడెలరాడె || నరసింహ రూపమున స్తంభమున దాగినాడె స్తంభమున దాగినాడె రక్కసుని చీల్చినాడె || గోవిందుడెలరాడె || వామనవతరమున బలిని దానమడిగినాడె బలిని దానమడిగినాడె బ్రహ్మాండము నిండినాడె || గోవిందుడెలరాడె || పరశురాముడై తాను రాజులను చంపినాడె రాజులను చంపినాడె భూమి దానమిచ్చినాడె || గోవిందుడెలరాడె || రామవతరమున రావణుని చీల్చినాడె రావణుని చీల్చినాడె భూమి భారము తీర్చినాడె || గోవిందుడెలరాడె || కృష్ణావతరమున లీలలెన్నొ చూపినాడె లీలలెన్నొ చూపినాడె వేణువును ఊదినాడె || గోవిందుడెలరాడె || బుద్ధావతరమున సుద్దులెన్నొ నేర్పినాడె సుద్దులెన్నొ నేర్పినాడె బౌద్ధ మతం నిల్పినాడె || గోవిందుడెలరాడె || సంఘవతరమున కెశవుడై పుట్టినాడె కెశవుడై పుట్టినాడె సంఘ శాఖ పెట్టినాడె || గోవిందుడెలరాడె ||

Comments

Leave a comment

Related Songs

Garuda Gamana Tava

Devotional33.8k plays

Namah Parvati Pataye

Devotional27.9k plays

jaya janardhana krishna

Devotional14.6k plays

Vinavamma Urmila

Devotional14.1k plays

Muripaala Gopaala

Devotional12.7k plays