🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Abhinava Haindava Sodara

PatrioticVijaya Vipanchi14.1k plays
Languages:
Telugu
PDF
అభినవ హైందవ సోదరా కనులు తెరచి ఒకసారి చూడరా || అభినవ || విశ్వగురువుగా విలసిల్లినది విశాల భారతమొకనాడూ భావదాస్యమున మ్రగ్గుచున్నది ఇండియా పేర ఈనాడూ ముక్కలు చెక్కలుగా చీలినది విశాలభారత మీనాడూ ఎవరికివారై విడిపోయిన మన అన్నదమ్ములను చూడు || అభినవ || లోకమంతటికి జ్ఞాన భిక్షను ప్రసాదించినది ఆనాడూ తన బిడ్డలలో జ్ఞానలేమిగని విలపించుతోంది ఈనాడూ స్వాభిమానమూ సమైక్య భావము లోపించినవీ ఈనాడూ నిస్తబ్దత నిర్వీర్యత నిరాశ నెలకోన్నవిలే ఈనాడూ || అభినవ || వ్యక్తీ స్వార్థము పదవీమోహము సమాజమున చెలరేగినవి న్యాయం ధర్మం సత్యాహింసలు స్వరూపమును కోల్పోయినవి ధర్మప్రబోధం కంటకమాయే విష బీజాలే పాతుకుపోయే పవిత్రజాతికి పతనము మొదలిడి పరాకాష్టకై పరుగిడుచుండే || అభినవ || విఘటన కెరయై చీలిన జాతిని సంఘటనమ్మున కలుపవలె పతనము చెందిన హైందవ జాతి పరమ వైభవము పొందవలె అఖండ భారత అజేయ శక్తిని ప్రపంచానికే చూపవలె ఆ పవిత్ర ధ్యేయము సాధించుటకై సర్వస్వార్పణ సలుపవలె || అభినవ ||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays