🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Amma Bharathi

PatrioticVijaya Vipanchi12.3k plays
Languages:
Telugu
PDF
అమ్మ భారతి అందుకో మా హారతి అందరమొకచోట నిలిచి పాడెదమీ కీర్తి గీతి !! భయపడేది లేదెవరికి కాగడ చేబూనుదాం అంబరాన్ని అంటి,భూమి నలుచెరుగుల చేరుదాం చీకట్లను పారద్రోలి ,దివ్యజ్యోతి నింపుదాం విజయం మనదేనంటూ జయకేతనమెత్తుదాం !!1 విలువల భాంధవ్యాలను తెలిపే మన కుటుంబం అందరినీ ప్రేమించే ఆటపాటలానందం ఇల్లే గుడి, చదువులబడి, అమ్మ ఒడియే పావనఝరి కష్టసుఖం కలగలిపి, కలసిమెలసి సాగుదాం !!2 శక్తి సంభరితమైన శివసుందర పుత్రులం హృదయ సంజనితమైన దేశ భక్త పౌరులం మనమంతా భక్తి ,జ్ణాన ,కర్మయోగ కిరణాలం మనమంతా త్యాగసేవ సద్గుణాల సేవకులం !!3 వివేకుని సేవాపథ నివేదితల వారసులం మానవతా పరిమళాలు వెదజళ్లే కుసుమాలం వసుంధరా శాంతి, ధర్మ స్థాపనకై కదలుదాం భరత మాత గౌరవాన్ని జగతిలోన నిలుపుదాం !!4

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays