ఆనంద తాండవం - శివుని తాండవం
సృష్టి స్థితి లయ కారక - రుద్ర తాండవం
1.ఢమరుకమే మ్రోగించిన పరమ శివుడవు
నాద శబ్దమే చేసిన నట రాజువు
సృష్టి కర్త నీవే - మహాదేవుడ నీవే
అభయ ముద్ర దాల్చిన ఆత్మ బంధువు నీవే
2. అణువు పరమాణువుల- కదలికలు నీవే
అంతరంగమందునా - పరమాత్మవు నీవే
అణు క్షణం నిరంతరం - చలన శక్తి నీవే
అజ్ఞానము అణిచి వేసే ఆది యోగి నీవే!!!
3. జీవుల నిర్జీవుల పరిమార్చేది నీవే
కుండలినీ శక్తుల - చైతన్యం నీవే
హృదయాకాశం లోన జ్యోతివి నీవే
జ్ఞానాన్ని అందించే ముక్కంటివి నీవే
4.
జటా జూట ధారి గంగాధరా
ప్రళయ కాల రుద్రా ప్రాణేశ్వరా
జగత్తు నే సృష్టించి,తిరిగి అంత మొందించే
శివుడవు భవుడవు భోళా నాథుడ నీవే!!