అందరి కోసం అన్నీ ఇచ్చిన దేశం కోసం పని చేద్దాం
దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలు కట్టేద్దాం !!అందరి!!
సూర్యుడు వెలుగుల కిరణాలిస్తే,వాయువు ప్రాణం పోస్తుంది
పొలాల పంటలతో భూమాత ఆకలి తీరుస్తూ వుంది
తోటి ప్రజలకు తోడుందాం-మానవత్వం చాటిధ్ధాం 'అందరీ"
దారిన పోయే జనులందరికి చెట్లు నీడనే ఇస్తాయి
వికసించే నవ పుష్పాలన్నీ సువాసనలు అందిస్థాయి
త్యాగమూర్తులను స్మరియిద్దాం-ఆదర్శంగా జీవిద్దాం 'అందరీ"
వెనుకబడిన మన అన్నదమ్ములను ప్రగతి పథమ్మున నడిపించాలి
మంచి మాటలే పలికించాలి చదువుల సారం నేర్పించాలి
శ్రమించి దీపం వెలిగిద్దాం - ఉజ్వల కాంతిని నింపేద్దాం 'అందరీ'