🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Apara Shiva Chatrapati hey shivaji raja

PatrioticVijaya Vipanchi7.4k plays
Languages:
Telugu
PDF
అపర శివా ఛత్రపతి హే శివాజీ రాజా విపుల హిందు రాజ్య ప్రతిష్ఠాపక హే రవి తేజా జై శివాజి రాజా జై శివాజి రాజా !!అపర శివా !! 1. విశృంఖల మ్ళేచ్చపాద తాడనాన కృంగిన మహి హిమ శృంగమునొక్కమారు ఊపి పైకి లేపినావు విధర్మీయ వికృతిచే వికలమైన హృదయాలలో స్వధర్మము స్వాభిమాన జ్వాలను పురికొల్పినావు !! అపర శివా !! 2. ధన్యయయ్యె జిజామాత ధర్మ రక్షకుని మాతై ధన్యుడయ్యె షహజీ ప్రభు యోధపుంగవుని పితయై ధన్యమయ్యె నవభారతి నిన్ను గన్న మహియై ధన్యమయ్యె హిందు జాతి మహనీయత కలదై!! అపర శివా!! 3.సకల సుగుణ శోభితుడవు సుసంఘటన దక్షుండవు మావళీల మాధవులుగ మార్చినట్టి జేత నీవు అరివీర భయంకరుడవు ఆర్తుల ఆశాజ్యోతివి వైరి గుండెలను చీల్చిన వీరాగ్రేసరుడవు !!అపర శివా!! 4. నీ జీవన సందేశము నింగినేల వ్యాపింపగ మా జీవన సర్వస్వము మాతృదేవి కర్పింపగ హిందుత్వపు ఛాయలోన విశ్వమెల్ల నడిపింపగ దీక్ష బూనినాము శివా దీవెనలందీయుమా !!అపర శివా!!

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays