🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Arpanacheyaga Samaya Mide

PatrioticVijaya Vipanchi9.7k plays
Languages:
Telugu
PDF
అర్పణ సేయగ సమయమిది ఋణము తీర్చుకొను తరుణమిది అర్పణ సేయగ సమయమిది... త్యాగనిరతికి ధర్మనియతికి పునీత భారతి నికేతనం దివ్యమైన మన ఘన చరితకు కాషాయకేతనం సంకేతం గగన సీమలో రెప రెప ఎగిరే భగవాధ్వజ గురు చరణాల మ్రోల మన తను మన ధన జీవిత సర్వం || అర్పణ || సృష్టికర్తయౌ బ్రహ్మ సృజించిన వేద వాఙ్ఞ్మయపు పుట్టిల్లు నారాయణుడే నరుడై పుట్టి నడయాడిన ఈ నట్టిల్లు హిమశైలమ్మున ఇల్లరికమునకు ఈశుని దించిన అత్తిల్లు లోక బాంధవుల ప్రియ బాంధవిగా వాసికెక్కినది మన ఇల్లు అట్టి దివ్య థామమ్మును పొందిన మన జన్మాంతర సౌభాగ్యానికి || అర్పణ || శ్రీహరిని కన్న కనక గర్భాన మనకూ ఊపిరి పోసినది గంగా నీరము క్షీరము చేసి అమృత స్థన్యము త్రాపినది ఉపనిషత్తులను ఔషధములతో కిల్భిషముల నెడ బాపినది ధర్మో రక్షతి రక్షితః అను బ్రతుకు బాట చూపించినది అంతటి తల్లికి సంతానముగా జన్మను పొందిన పుణ్య ఫలానికి || అర్పణ ||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays