🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Bhaavamulona

DevotionalVijaya Vipanchi6.8k plays
Languages:
Telugu
PDF
భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా ... హరియవతారములే అఖిలదేవతలు హరిలోనివే బ్రహ్మాణ్డములు హరినామములే అన్ని మంత్రములు హరిహరి హరిహరి యనవోమనసా ... విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుడొక్కడె విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా ... అచ్యుతుడితడె ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీవేంకటాద్రిమీదనిదె అచ్యుత అచ్యుత శరణనవో మనసా

Comments

Leave a comment

Related Songs

Garuda Gamana Tava

Devotional33.8k plays

Namah Parvati Pataye

Devotional27.9k plays

jaya janardhana krishna

Devotional14.6k plays

Vinavamma Urmila

Devotional14.1k plays

Muripaala Gopaala

Devotional12.7k plays