🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Bharata Samskruti Parirakshanakai

PatrioticVijaya Vipanchi8.5k plays
Languages:
Telugu
PDF
భారత సంస్కృతి పరిరక్షణకై - సాగించాలి సాధనా విజయపథమ్మున శ్రమించు తపించు - మాతృభూమి ఆరాధనా జయహో భరతమాత జయహో జయహో జగజననీ జయహో !! 1 విజ్ఞానం వీక్షించిన మునులు - పొంగిపొరలె మానవతా సుధలు కణకణమున చైతన్యం నిండిన - సుందర జీవన భూమి ఇది సర్వజనుల సంక్షేమం కోసం - చేద్దాం సర్వస్వార్పణా !!విజయపథమ్మున 2 ధర్మదండమును చేతబూనుదాం - భారత ప్రతిభను ప్రకటిద్దాం ధనాకంక్షలను నియంత్రించుదాం - జీవనమున్నతి సాధిద్దాం సాధారణ జన జీవితాలలో - చిరుదివ్వెలనే వెలిగిద్దాం !! విజయపథమ్మున 3 వైవిధ్యాలెన్నున్నా గాని ఏకాత్మతతో జీవిద్దాం వైరుధ్యాలను అధిగమించుదాం - సమరస భావం నిర్మిద్దాం జగమంతా మన కుటుంబమే - ప్రేమామృతమును పంచుదాం !! విజయపథమ్మున

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays