🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Bharata Vandemataram Jaya Bharata

PatrioticVijaya Vipanchi8.8k plays
Languages:
Telugu
PDF
వందేమాతరం వందేమాతరం వందేమాతరం భారత వందేమాతరం జయ భారత వందేమాతరం పెను తుఫానులకు వెనుకడుగేయక మునుమున్దునకే అడుగిడదాం జీవన పుష్పము మాతృ చరణముల సేవలకంకిత మొనరిద్దాం ||వందేమాతరం|| హృదయ పీఠిపై మణిహారముగా పావన గంగా ప్రవహింప మణి మేఖలయై వింధ్య సాత్పురా పర్వతపంక్తులు భాసింప సస్య సాణువే వజ్ర హస్తయై సస్య సాణువే వజ్ర హస్తయై వరలిన తల్లికి జేజేలు ||వందేమాతరం|| మస్తకమున హిమరాజ విరాజిత మకుటము కాంతులు విరజిల్ల చరణరజమ్మును విశాల సాగరలహరులు క్షాళన మొనరింప పచ్చని పంటల పచ్చని పంటల పట్టు చీరను కట్టిన తల్లికి జేజేలు ||వందేమాతరం|| ఇలనెవ్వరికీ తల వంచదులే ప్రచంఢ భారత ప్రతాపము వినువీధులలో విహరించునులే భారత వైభవ పతాకము త్యాగ భావ సౌశీల్య జ్ఞానముల త్యాగ భావ సౌశీల్య జ్ఞానముల ప్రగతిని జగతికి చూపిద్దాం||వందేమాతరం||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays