🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Bharatamata pallaki mose

PatrioticVijaya Vipanchi14.4k plays
Languages:
Telugu
PDF
భారతమాత పల్లకి మోసే బోయిలమంతా మనమే నిప్పు రవ్వలను రాల్చుతూ నిలిచే నింగిన చుక్కలు మనమే !!2!! జాగోరే ........... సాధక - జన జాగరణే మన వేదికా ! జాగోరే .. ! రాముని కథ నేతృత్వం మనమే - కృష్ణుని గీతకు గాత్రం మనమే చాకక్యుని చదరంగం మనమే - శివాజీ ఎత్తిన ఛత్రం మనమే వీరుల శూరుల ధీరులంమనమే - అసుర పాలిట శరములంమనమే అనంత విశ్వం అఖండ రూపం కాంచిన స్వప్నం మనమే మనమే ! జాగోరే .. ! ధర్మధేను పదాలంమనమే - కర్మ భూమి కణజాలం మనమే సంస్కారం, సంద్రాలం మనమే -సారస్వత సుమగంధం మనమే సత్యం మనమే నిత్యం మనమే - సత్వం మనమే తత్వం మనమే పవిత్ర గాలులు స్వసంత్ర్య వీధుల పాడిన పాటల సారం మనమే ! జాగోరే .. ! సజ్జన శక్తికి సాక్ష్యం మనమే - దుర్జన ముక్తికి మూలం మనమే పరివర్తన పరమార్థం మనమే - ప్రపంచ శాంతికి దూతగ మనమే భారతి ఆశ శ్వాస మనమే - భావి తరానికి సారధి మనమే నవ్య జగానికి దివ్య గానమై నడుంబిగించిన శక్తులు మనమే ! జాగోరే .. !

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays