భారతీయ యువకుడా బయలుదేరవోయ్
భారతీయ ప్రజావళిని మేలుకోల్పవోయ్
భావదాస్య పారతంత్ర భావాలను పారద్రోలి
భారతీయ జనతలోన జాతీయత రగుల్కొల్పి || భారతీయ ||
నీవాడు నావాడని లేనేలేదోయ్
దేశమంత ఒక్కటని విస్మరించకోయ్
కులము మరచి హిందువునని చాటిచెప్పవోయ్
కలసి మెలసి కర్మణ్యత నాశ్రయించవోయ్ || భారతీయ ||
సంఘ శాఖ నుండి నీవు స్ఫూర్తి నొందవోయ్
నడతతో నవ చరిత్ర సృష్టించాలోయ్
యువతకు అదియే ఆదర్శమవ్వలోయ్
కర్మవీర నిర్మాణం సాగిపోవాలోయ్ || భారతీయ ||
విజయశీల సంఘటనా కార్య శక్తితో
హిందుధర్మ రక్షణకై ప్రతినబూనవోయ్
మాతృ దేశ వైభవమును సాధించుటలో
సర్వస్వార్పణ చేయుట ఒకటే మార్గమోయ్ || భారతీయ ||