🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Bhumaataku abharanam

PatrioticVijaya Vipanchi4k plays
Languages:
Telugu
PDF
పల్లవి: భూమాతకు ఆభరణం - పర్యావరణం భూమి పుత్రులం మనమే సంరక్షకులం !! 1. కాలుష్యం క్రమ్ముకుని వేడి సెగలు కక్కుతోంది మంచుకొండలే కరిగి వరద ముంచుకొస్తోంది కోతకు గురియై భూమి వనసంపద కోల్పోయెను మానవ జీవితమంతా మటుమాయం కానున్నది !! 2.చుక్క చుక్క నీటి బొట్టు చక్కగ నువు ఒడిసి పట్టు సకల జీవ జంతువుల జీవనాన్ని నిలబెట్టు గలగల పారే నదులను మిలమిల మెరయంగజేసి ప్రకృతి తల్లి ఒడిలో సేద తీర్చుకుందాము !! 3.ప్రాణాలను హరియించే ప్లాస్టిక్ భూతాన్ని తరిమి జీవ కోటి మనుగడకై విజ్ఞానం అందించు అత్యాశలు, కోరికలూ తీర్చేందుకు కాదురా అవసరాలు పూర్తి చేసే భూతలమే మనదిరా !! 4.ప్రాణవాయువారోగ్యం అందించే వృక్షాలను పెంచి పోషించి మనం మానవునిగ ఎదగాలి చెట్లు బ్రతికితేనె కదా మనం బ్రతికి ఉండేది తరతరాల ఈ సంస్కృతి అందరికీ పంచుదాం!! 5.గాలి,నీరు,భూమి,అగ్ని, అడవులు, ఆకాశమంత పశువులు, పక్షులు, పర్వత, సముద్రాల జలాలన్ని మన జీవన యాత్రకిదే పచ్చని పర్యావరణం సంతులనం కాపాడి సంబరంగ ఉందాము !!

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays