🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Bratuku SukhamayyEnura

PatrioticVijaya Vipanchi7.6k plays
Languages:
Telugu
PDF
బ్రతుకు సుఖమయ్యేనురా ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్ని పండేనురా ||బ్రతుకు సుఖమయ్యేనురా|| ఉన్నోడు లేనోడు అన్న తేడా లేక అమ్మ ఒడి లో బిడ్డలాటాడుకొన్నట్లు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలసిమెలసుంటుంటే ||బ్రతుకు సుఖమయ్యేనురా|| కులము ఏదైనాను కోరేది మోక్షమే కులముకై మనకేల కాకి మూకల గోల బ్రతికున్న మూణ్ణాళ్ళు పదిమంది బంధువై కష్ట సుఖములలోన కలసిమెలసుంటుంటే ||బ్రతుకు సుఖమయ్యేనురా|| శృతిలేని పాటలా మతిలేని మాటలా ఎంత గొంతెత్తితే ఏమి లాభమ్మురా నీటి చుక్కల్లాగ కాటి పువ్వుల్లాగ నశియించి పోకుండ నలుగురితొ కలిసుంటే ||బ్రతుకు సుఖమయ్యేనురా||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays