🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Desa Gauravam Inumadimpaga

PatrioticVijaya Vipanchi11.5k plays
Languages:
Telugu
PDF
దేశ గౌరవం ఇనుమడింపగా - సగర్వమ్ముతో పయనిద్దాం సమర్థులై మన శక్తి యంతటిని - ప్రపంచమంతా ప్రకటిద్దాం!! 1.వివిధ రూపముల విలసితమైన - జీవసృష్టి పరమాద్భుతము దోషము లెంచక గుణవిశేషతలు - గుర్తించుటయే సమ్మతము ఆత్మరూపమును ఆరాధించి - వికాసపథమున విహరిద్దాం !! సమర్థులై మన !! 2. ఒకరినొకరము తోడుగ నిలిచి - ఒంటరితనమును వదిలేద్దాం జంతుజీవనం వినాశ కరము - మానవత్వమే మహోన్నతం కష్ట సుఖమ్ముల వెలుగు నీడలో - చిరునవ్వులనే విరబూద్దాం !! సమర్థులై!! 3. కల్మశాలు దరి జేరనీయక - సుందర రూపం చూపిద్దాం దాగివున్న మన ప్రతిభా పాటవ - శక్తి యుక్తులను వెలిగిద్దాం చెమటోడ్చే మన జీవన సరళితో - సుఖ వైభవములు సాధిద్దాం !! సమర్థులై!! 4. అపురూపం ఈ మానవ జన్మ - సంఘసేవలో అర్పిద్దాం పావన మంగళ భావనతో - నిర్మల గంగను దర్శిద్దాం అమృత ధారలు పొంగిపొరలగా - భారతమాతను పూజిద్దాం !! సమర్థులై!!

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays