దేశమొసగిన దేహమే ఇది దేశమే నిను పిలిచెరా
కారు చీకటి క్రమ్మునప్పుడు కాంతి నీవై కదలరా
తోటివారల కష్ట సుఖముల తోడు నీవై తరలరా
మట్టి లోనే పుట్టినావు మట్టి కొరకే గిట్టరా
మట్టి నుండే మనిషి వచ్చే మరల మట్టిని కలియురా
దుర్లభమ్మీ హిందు జన్మము జన్మ జన్మల పుణ్య ఫలితము
మరచిపోకుము జన్మనిచ్చిన మాతృభూమిని ఎంత మాత్రము