🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Desamkosam Jeeviddam

PatrioticVijaya Vipanchi23.5k plays
Languages:
Telugu
PDF
దేశం కోసం జీవిద్దాం -దేశం కోసం జీవిద్దాం దేశం కోసం జీవిద్దాం - మన దేశం కోసం జీవిద్దాం మనం మనం మహాగణం - మహాగణమ్మే ప్రభంజనం నేనోక్కడినని అనుకుంటే - నేతాజీ ఎట్లగుదువోయి శివమెత్తక నువు కూర్చుంటే - శివాజీ ఎట్లగుదువోయి చీమల గుంపును గమనిద్దాం - పక్షుల పయనం పరికిద్దాం నీటిన నిప్పును రగిలిద్దాం - నింగిన చుక్కల శాసిద్దాం చరిత్రలోని మహాపురుషులను – ప్రతినిత్యమ్ముస్మరించుదాం || మనం మనం ... || ఇది భూతల స్వర్గమ్మేలే - ఇక్కడ అందరు బంధువులే మనమూ మనదంటే సరిలే - కాదంటే ఇక కుదరదులే ఇంటిదొంగలను గమనిద్దాం - ఇజాలనిజాల ఛేదిద్దాం రక్కసి మూకల గుర్తిద్దాం - రామ బాణమును సందిద్దాం చరిత్ర నేర్పిన గుణపాఠాలను - ప్రతినిత్యమ్ము పఠించుదాం || మనం మనం ... || ఈ మట్టిన పుట్టిన కుందేలే - వేట కుక్కలను తరిమెనులే ఈ చెట్టున ఆడిన ఆ ఉడతే - సేతు బంధనం చేసెనులే జఠాయువయ్యి జన్మిద్దాం - జన్మ సార్ధకంబొనరిద్దాం తను మన ధనములనర్పిద్దాం - తల్లి భారతిని సేవిద్దాం పరంపరాగత చరిత్రలోని - పరమార్ధమ్మును గ్రహించుదాం || మనం మనం ... ||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays