ధ్యేయశీలి కర్మశీలి ఓ హిందూ కదలిరా
విశ్వానికి వినిపించగ హిందు దివ్య సందేశం
మన సంస్కృతి వైభవాలు నీ స్పూర్తికి నిలయాలు
మన దేశపు మహోన్నతికి పులకించును హృదయాలు
గ్రహించాలి వాస్తవాలు మున్ముందుకు నడిచేందుకు
గత చరితలు కావలి నీ ప్రగతికి దీపాలు ||ధ్యేయశీలి||
అస్పృశ్యత పాపమని నినదించు ఒకే స్వరమై
దీన దళిత ప్రజావళికి సేవ చేయి అంకితమై
సమరసతను సాధించి సంఘటితం అవుదాము
సమత మమత వెల్లివిరియు సమాజాన్ని నిర్మిద్దాం ||ధ్యేయశీలి||
హిందుత్వపు జయ దుందుభి మార్మోగ్రెను నలు దిక్కుల
ఉప్పొంగిన జాతీయత సృష్టించెను నవచేతన
నవ భారత ఉషోదయపు వెలుగు రేఖలౌదాము
రాష్ట్ర వైభవానికి పూల బాట వేద్దాము ||ధ్యేయశీలి||