🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

ee desam manadira

PatrioticVijaya Vipanchi7.7k plays
Languages:
Telugu
PDF
ఈదేశం మనదిరా ఈసంస్కృతి మనదిరా ఈధర్మం మనదిరా మన చరిత్ర మరువకురా శ్రీరాముని మహిత కథ వేదసార దివ్య సుధ విలువ నేర్పి నీతి పంచి లోకహితం కూర్చెరా శ్రీ శంకర రామానుజ భౌద్ధ జైన దర్శనాలు విశ్వశాంతి కోరి మనకు జగద్గురుత నొసగెనురా ఝాన్సీ రుద్రమదేవి టంగుటూరి నేతాజీ బానిసత్వ విషవలయం త్రుంచు విధం నేర్పెరా భగత్ సింగ్ ఆజాద్ విప్లవాగ్ని అల్లూరీ చిరునవ్వుతొ బలిదానం చేయు విధం చూపెరా ఈధర్మం ఈసంస్కృతి నరనరాన నింపరా మాతృదేశ వైభవం దశదిశలా చాటరా తల్లి ఋణం తీర్చుటకై తరలిరమ్ము సోదరా మాతృభూమి రక్షణకై చేయిచేయి కలిపిరా

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays