🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Hararthi gai konuma

PatrioticVijaya Vipanchi1.9k plays
Languages:
Telugu
PDF
హారతి గై కొనవమ్మా మా హారతి గై కొనవమ్మా మనో వాంఛలు నెరవేర్చేందుకు అవతరించవమ్మా భువిలో అవతరించవమ్మా 1. సకల దేవతల బలమును పొంది సప్త మాతృకల రూపమునొంది భయాన్ని గొలిపే దుష్టుల దునిమి భక్తుల ఆర్తిని హరించవమ్మా !! హారతి!! 2. విశ్వానికి ఆధారము నీవే విశ్వ మంతటా వైష్ణవి నీవే శుభముల నిచ్చే జననివి నీవే శైవ శక్తి శివ దూతివి నీవే !!హారతి!! 3. ముక్తి నొసంగే నారాయణివీ శక్తి ప్రదాయని నారసింహివీ శరణా గతులను అనుగ్రహించే కరుణా మూర్తివి దయా రూపిణి !!హారతి!! 4. మహిషా సురుని మర్ధన చేసి చండ ముండులను పరిమార్చేసి రక్త బీజుని సంహరించితివి శుంభ నిశుంభుల హతమార్చితివి !!హారతి!! 5. దేవీ మహాత్మ్య కథలే వింటాము ఆపదలను తొలగించమ్మా పారాయణమే సాగించెదము పాపములను కడ తేర్చమ్మా !!హారతి!! 6. స్తోత్ర పాఠములు చదివెదము నీ సన్నిధిలో మము నిలుపుమ్మా ఉపచారాలే చేసెదము మా అపచారము మన్నించమ్మా !!హారతి!!

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays