హిందుభూమి ఇది మన దేశం వందనీయమిది మన ధర్మం
గౌరీశంకర గిరిపై నెగురును గురువగు అరుణధ్వజం, గురువగు అరుణధ్వజం
రామకృష్ణుల భూమి ఇదే ఋషిమునిజనముల భూమి ఇదే
అవతారాలకు స్థానమిదేగా అవనికి మోక్ష ద్వారమిదేగా
మంగళప్రదమై మహిలో వెలిగే మాతృభూమి ఇదియే , మాతృభూమి ఇదియే || హిందుభూమి||
వ్యక్తీ వ్యక్తినీ సమీకరించీ శక్తి తత్వమును ఆరాధించీ
గతవైభవమును జ్ఞప్తికి తెచ్చీ ఆత్మవిస్మృతిని అంతం చేసీ
నరనరములలో నవనాడులలో జాగృతి నింపేద్దాం, జాగృతి నింపేద్దాం || హిందుభూమి ||
కంటకమయమీ మార్గంబైనా కర్మవీరులుగ పనిచేద్దాం
అరివర్గాలను అంతం చేసి ధరణిలో విజయం సాధిద్దాం
భువిపై హైందవ జాతి ప్రతిష్టను సుస్థిరమొనరిద్దాం, సుస్థిరమొనరిద్దాం || హిందుభూమి ||
సమాజ శ్రేయమే మన ద్యేయం ఆత్మసమర్పణ మన మార్గం
నిద్రాహారాల్లేకున్నా నీరధి మన పై పడనున్నా
పదం పదంతో మిళితం చేసి కదనం సాగిద్దాం, కదనం సాగిద్దాం || హిందుభూమి ||