🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Hinduvuga Janminchuta ila lo

PatrioticVijaya Vipanchi7.4k plays
Languages:
Telugu
PDF
హిందువుగా జన్మించుట ఇలలో మహా భాగ్యమని మరువకురా హిందువులే ఈ గడ్దను పుట్టిన ముద్దుబిడ్దలని చాటుమురా దారులనేకం దేవుడొక్కడని చాటిచెప్పినది హిందువురా ఘోర పాపములు చేసిన క్రూరుల మదమణంచినది హిందువురా కారు చీకటుల బాపి జగానికి దారి చూపినది హిందువురా భారమనక శరణార్ధి జాతులకు నీడనొసగినది హిందువురా రావణాది రాకాసి మూకలను సంహరించినది ఎవరోయీ దండిగ వచ్చిన శత్రు మూకలను తిప్పికొట్టినది ఎవరోయీ గ్రీకు, హూణ, శక, కుషాణాదులను మ్రింగి వైచినది ఎవరోయీ ఆది అంతములు లేని చరిత్రకు నిజమగు వారసులెవరోయీ ఇజాల పేరుతో నిజానిజాలను గాలికి వదిలితె అధోగతీ జంకక గొంకక ధర్మము తప్పక సత్యమాడితే పురోగతీ స్వాభిమానమూ స్వీయచరిత్రలు మరచినవారికి అధోగతీ పూజ్య కేశవుడు చూపిన మార్గము అనుసరించినచో పురోగతీ

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays