హైందవుడను నేనంటూ గర్వముతో గర్జించు
హిందువుగా జీవించు హిందువుగా మరణించు
అవనిలోన నరుని జన్మ లభించుటే దుర్లబం
అందులోన హిందువుగా పుట్టుట మనకొక వరం
ఆర్య భూమి భరతమాత అనుగు పుత్రుడవు నీవు
అఖిల విశ్వమార్య మొనరించుటకై పుట్టినావు || హైందవుడను||
రాముని కథ కృష్ణుని కథ నీ పూర్వుల కథ కదా
శంకర గౌతమ నానకులే నీ పితరులు కారా
రాణా గోవింద శివులు నీ సోదరులే కదా
రామకృష్ణ దయానంద నరేంద్రులను మరచితివా || హైందవుడను||
నీ ధర్మం జ్ఞానసుధలు జగతిని ముంచెత్తెను
నీ ధర్మం విశ్వానికి నాగరికత నేర్పెను
సర్వ ధర్మ సమభావన చాటిచెప్పే హైందవం
సత్యమొక్కటే నంటూ ఘోషించెను హైందవం || హైందవుడను||
భారత పతనావస్థకు బాధ్యత నీవే కదా
భావి పునర్వైభవమ్ము నీ చేతులలో లేదా
కలసి మెలసి హిందు జాతి మెలగాలి
కన్నతల్లి కనులలోన కలల పంట పండాలి || హైందవుడను||