ఇది నా భారత దేశం ఇది నా భావ నివేశం
ధర్మ క్షేత్రం కర్మ క్షేత్రం నవ నవోన్నతం భావ భరితం
ప్రవిమలం నా దేశోన్నత్యం వెల్లివిరిసెను విశ్వ ఖ్యాతమై
వేద వ్యాసులు ఆది శంకరులు వెదజల్లిరి భువి వేదామృతమును
పాదు కొలిపిరి పృధ్వీ తలమున స్వాదు భరితమౌ మాదు చరితము
హిమాలయం నా భావ నిలయం ఊహలు ఉరికే మహాలయం
నీరై కరిగెడు నీ హారం హైందవ జీవన మధు కాసారం
నేను విధాతను నేనచ్యుతుడను నేను రుద్రుడను నే హైందవుడను
నే నీ పుత్రుడ తల్లివి నీవే నీ వైభవమే జీవన గమ్యం