🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Jai Bhavaani Veera Shivaraya chatrapati shivaraya

PatrioticVijaya Vipanchi311 plays
Languages:
Telugu
PDF
1. నూటోక్క కొండపై,శత్రు మూక గుండెపై శివ మెత్తెను దండేత్తెను ఛత్రపతి శివరాయ గొరిల్లా యుద్ధ తంత్ర - భవానీ ఖడ్గమై తలలే చెండాడేరా ఛత్రపతి శివరాయ 2. మతోన్మాద రక్కసుల శతాబ్దాల దండయాత్ర గోమాతల రక్తంతో విగ్రహాల విధ్వంసం నర హంతక దాడులతో స్త్రీ బాల వృద్ధులంత హాహా కారాలతో పరుగులేత్తు ఆ క్షణాన 3. కోటలనే ఆక్రమించి,కాషాయం నేల దించి ప్రలోభాలు భయాలతో మత మార్పిడి గావించి హిందువులను కాఫీర్లుగ ఎంచి అంతమొందించే ముష్కరులను పనిపట్టగ ఉద్ధండ పిండమై 4. జగదీశ్వర అంశతో జగదంబ వరంతో జీజా గర్భమ్ములో వీర శివా ఉద్భవించేరా క్రూరమైన మొఘలు జాతి నడ్డగించి గుండె చీల్చి ఛత్రపతి విక్రమించేరా శంభో శంకర హర హర మహాదేవ శివ తాండవ మహా నృత్యం మహా కాల రుద్రావతారం గో రక్షా దీక్షా ధర శివరాయ నమోస్తుతే జై భవానీ వీర శివాజీ, 5. భండారి,మావలీల,కోలీలను కూడగట్టి స్వాతంత్ర్యపు సమర జ్వాల గుండెల్లో రగుల్కొల్పేరా ఆదిల్షా,కుతుబ్షా,మొఘల్ పాద్షా నవాబు, పోర్చు్గీస్,ఫ్రెంచి, డచ్చి,ఆంగ్లేయుల పీచ మడచెరా 6. సమర్థ రాము- తుకారాము శాస్త్ర విద్యలన్నీ నేర్చి - దాదాజీ కొండ దేవ్ శస్త్రవిద్య ఆరి తేరి, నేతాజీ,సూర్యాజి,ధనాజీ ల శౌర్య బలం హంబీ,ప్రతాప్ రావు కండబలం తోడుండె 7. గఢ ఆలా సింహ గేలా తానాజీ మాల్సురే తల తెగినా పోరు చేసే ధీర వీర బాజీప్రభూ ఏనుగు కుంభస్థలినే బద్దలు కొట్టిన యశాజీ కొండలనే పిండి చేయు సంతాజీ ఘోర్పడే 8. బాల్యమందు చొరవజూపి శత్రువులకన్నుగప్పి తోరణ గడ్ విజయ్ గడ్ ల అవలీలగ చేపట్టి, సింహ గడ్,సింధు గడ్,శత దుర్గాలన్నిటిపై రాయ్ గడ్ శిఖరంపై ధర్మ ధ్వజం ఎగరేసే నాభిషేకో న సంస్కార: సింహస్య క్రియతే మృగై: విక్రమార్జిత రాజ్యస్య స్వయమేవ మృగేంద్రతా జై భవానీ వీర శివాజీ 9. బిందు బిందు సింధు హిందు సాగరమే పొంగగా సూర్య,చంద్ర కాంత శిలల హిమనగమే సాక్షిగా హిందు పద పాద షాహి శివరాజే మృగరాజై సింహాసన మధిష్టించెరా జై భవానీ వీర శివాజీ 10. బానిస సంకెళ్లు త్రెంచె,స్వాభిమాన మహా రథి హిందూ జన సంరక్షక సుస్వరాజ్య సారథి, శస్త్ర నీతి,శౌర్యవంత,కీర్తివంత, సాహసీ కుశాగ్ర బుద్ధి మంత, సూర్య తేజవంత,రాజసీ జై భవానీ వీర శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి జై

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays