🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Jana Jagruta Navabharata Mahodayam

PatrioticVijaya Vipanchi16.5k plays
Languages:
Telugu
PDF
జన జాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం ఈ జీవితమున సాధించుదాం ||జన|| ప్రతి హృది లో దేశ భక్తి మోసులెత్త నర నరాన నవచేతన వెల్లివిరియ సమతాభావన పెంచి ప్రతి హృదిలో మమత నింపి జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం ||జన|| మన పూర్వుల మహనీయుల స్మరియించి మన సంస్కృతి మహోన్నతిని గుర్తెరిగి అహరహము శ్రమియించి జగతిన శిరమెత్తి నిలచి జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం ||జన|| ప్రాంత భాష కులమతాల కలతలతో పలురీతుల బలహీనత లావరించె అందరమొకటిగ నిలచి తరతమ భేదాలు మరచి జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం ||జన|| నలుదిక్కుల ప్రమాదాలు పెచ్చుపెరిగి అదనుచూచి కాటువేయ చూస్తున్నవి జనతను జాగృతపరిచి ఎదఎదలో శక్తి నింపి జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం ||జన||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays