జవాన్ నా హీరో .... జై జవాన్ నా హీరో
కంటికి కునుకే లేకుండా ..కనురెప్పల్లా కాపాడంగా
దేశం కోసం దేహాన్నిచ్చే ...జవాన్ నా హీరో ...జై జవాన్ నా హీరో ...!!
1. నిద్దుర కరువై సరిహద్దుల్లో పహారా కాస్తావు
హద్దులు దాటిన శత్రు మూకల హత మారుస్తావు
నా స్వేచ్ఛ కు మూలం నువ్వే
నా కంటికి వెలుగువు నువ్వే
ఈ దేశంలో ప్రసవించే ప్రతి బిడ్డకు ఊపిరి నువ్వే
జవాన్ నా హీరో ...జైజవాన్ నా హీరో ... !!కంటికి!!
2. కన్నతల్లిని,వున్న వూరిని కాదని వచ్చావు
సుఖ సంతోషం కాలదన్ని కష్టాలు వరించావు
ఏ తల్లికి పుట్టిన బిడ్డ వో
ఏ వూరికి చెందిన వాడివో
భారత మాతా పుత్రుడ నేనని ముందుకురికేది నువ్వే
జవాన్ నా హీరో .... జై జవాన్ నా హీరో !!కంటికి!!
3. ఛాతి ని విరిచి ఎదురొడ్డే నీ ధైర్యం హిమాలయం
శత్రు శిబిరాలు ధ్వంసం చేసే సాహసమే ప్రళయం
నా యువతకు ప్రాణం నువ్వే
నా జనత కు ప్రేరణ నువ్వే
స్వాతంత్ర్యం నా జన్మ హక్కని కదం త్రొక్కేది నువ్వే
జవాన్ నా హీరో .... జై జవాన్ నా హీరో !!కంటికి!!