జయమగు గాతా భారతమాతా - అతులిత బలసముపేత
అభయ ప్రదాత జగ విఖ్యాత అగణిత గుణ సమవేత
మా ఊహలు మా ఉచ్చ్వాసాలు మా భావాలూ గానాలూ
నీకేనమ్మా అంకితము నీకేనమ్మా అంకితము
మా సర్వసం నీవేనమ్మా మా సర్వసం నీవేనమ్మా ||జయమగు||
ఈ జీవితమూ నీవేనమ్మా - నీవు లేక ఇది మోడే నమ్మా (2)
సుందర సుర బిళ కుసుమము చేసి (2)
అర్చిన్తుము నీ పదముల నమ్మా ||జయమగు||
నీ సంతానపు సంక్షేమానికి నిరతము తానే నీరాజనమై
కరిగి పోవు ఆ భవ్య జీవనమె (2)
ధన్యము ధన్యము ధన్యము తల్లీ ||జయమగు||