పల్లవి::కదలి రండి భారతీయ యోధుల్లారా
తరలి రండి భారత మాత బిడ్డలారా
వందేమాతరం వందేమాతరం
చరణం1:: వందేమాతరం అన్న గొంతు మనదిరా
భగసింగ్ ఆజాదుల జాతి మనదిర
గొంతులన్ని ఒక్కటైతే నలుదిక్కులు అదురునురా
అడుగులన్ని ఒక్కటైతే జాతి ప్రగతి సగునురా ||వందే మాతరం ||
చరణం2:: నేతాజీ జైహిందు అని పిలుపునివ్వగా
వివేకుడే హిందువునని చాటి చెప్పగా
వీర శివ సంఖమునీ పూరింపగా
ప్రతాపుడే భుజ బలమును చూపించగా ||వందే మాతరం ||
చరణం3::జనని జన్మ భూమి కన్నమిన్న లేదురా
అయోద్యాయే మన రాముని జన్మ భూమిర
శ్రీ రాముని జీవితమే మానవాళి కాదర్శం
శ్రీ రాముని మందిరమే స్వాభిమాన సంకేతం ||వందే మాతరం||