కేల్మోడ్తుమో దేవ కేశవా
పెను తుపానున దివురు మన దేశ నౌక
కడలి తీరము చేర్చిన ఓ కర్ణ ధారీ
నీ జీవితములోని క్షణక్షణము కణకణము
నిజము మాకెల్లరకు స్ఫూర్తిదాయకమౌను
నీవు అమరుడవయ్య నీవు అజరుడవయ్య
ఓ మంత్ర ద్రష్టా ఓ మహా యోగీ
ఆత్మ విస్మృతి బూని అడగిపోయిన జాతి
పారతంత్ర్యపు బ్రతుకు పరికించి కుమిలేవు
అహరహము తపియించి అనుక్షణము జ్వలియించి
అత్మార్పణము చేసినావా
సొంత సౌఖ్యాలు కాసంతయైనను లేవు
జాతి సుఖమే నీదు సౌఖ్యమనుకున్నావు
నీ హృదయ కుహరాన నిలచినా జ్యోతిచే
వేనవేల్ హృదయాల వెలుగు నింపేవా