🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Koti Gontulu Ekamai

PatrioticVijaya Vipanchi13.9k plays
Languages:
Telugu
PDF
పల్లవి: కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం, అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం, భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా జై జై , భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా జై జై||2||* చరణం - 1 ఈ భూమి తల్లియని నేనామె పుత్రుణ్ణని,  జనని జన్మభూమి కన్న స్వర్గము లేనేలేదని,  స్వాభిమానమును చాటి దేశ గౌరవము నిలుపగ ||2 సార్లు!| భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా జై జై||  కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం, అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం!! చరణం - 2 ప్రజలను రెండుగ చీల్చే పదవీ స్వార్థాలు వదలి ,  కులముల కొట్లాట వీడి దేశమాత చెంతచేరి ,  సామరస్యమును జూపి సమైక్యతను సాధించగ ||2|| భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా జై జై||    కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం, అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం చరణం - 3 సంఘర్షణ కానరాని వైవిధ్యం గల దేశం,   దారులన్ని వేరైనా ఒకే సత్య సందేశం,  కాశ్మీరము నుండి కదలి కన్యాకుమారి దాకా ||2||భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా జై జై కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం, అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం   ||భారత్ మాతా|| చరణం - 4 మానవత్వమును పంచి మన సంస్కృతి నిలిచింది,  సేవా త్యాగాలతో జగతి విస్తరించింది,  శాంతి ధర్మ స్థాపనకై మనమంతా ఎలుగెత్తి ||2||భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా జై జై కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం, అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం|||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays