లెండిరా లెండిరా శివమెత్తి రండిరా మనం మనం మహాగణం
మహాగణం ప్రమథ గణం మంటి మింటి నంటుట ముక్కంటి తాండవమ్ముగా
మళ్ళీ దేశానికిపుడు మరో కీడు మూడినది
మతం మార్పు కుట్రలతో జాతి రూపు మారినది
పుణ్య భూమి ఉండగా నీవు నేను అండగా
మీనాక్షీ పురం చూడు కన్యాకుమారి చూడు
పరమతాల పీడనం పరకాష్ఠ చేరింది
ధర్మభూమి నిండుగా త్యాగమూర్తులుండగా
అంటరాని తనం పేర పెరుగుతోంది నాశము
పేద సాద జనం పేర జరుగుతోంది మోసము
కన్నభూమి పండగా కలసి మెలసి ఉండగా
విప్లవ నాదం చాటు విదేశ దాడి దాగినది
పదవుల కొట్లాట చేత జాతి నాడి విరిగినది
కర్మ భూమి ఉండగా కర్తవ్యం పండగా