🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Maadenoy Hindustan

PatrioticVijaya Vipanchi6.9k plays
Languages:
Telugu
PDF
మాదేనోయ్ హిందుస్థాన్ మాదే మాదే మాదేనోయ్ ఢమ ఢమ ఢమ ఢమ ఢక్కనగారాల్ దిక్కు పిక్కటిల మ్రోగిస్తాం గణగణ గణగణ ఘంటారావం ఘన గర్జనగా వినిపిస్తాం రెప రెప రెప రెప రిక్కల తాకగ విజయ పతాకాన్నెగరేస్తాం నింగిదాటి శృంగాల నిలచి మన దేశ గౌరవం ఘోషిస్తాం చలువల వీడూ కొండలఱేడూ హిమవంతుండు మావాడే త్రిభువన పావని దివ్య సువాహిని మాయమ్మే గంగామాయీ తరగల నురగల మెరుగులు వెట్టెడు హిందు సంద్రమూ మాదేనోయ్ ధాటి మేటి జిత శతృ కోటియౌ ధనుష్కోటియది మాయదియే నవ విచిత్ర రమణీయ నందనము కాశ్మీరము మా యుపవనమే కొండల గుట్టల నాగుల యోగుల పూర్వ ప్రాంతమది మా యిరవే గంగా సింధూ గౌతమి కృష్ణల పయోవర్ధితం మా నెలవే అతి మనోజ్ఞ శిల్పాలకాలయం దక్షిణ ప్రాంతం మాదేనోయ్ దేశ గౌరవము దేశ సంపదా తేజరిల్లగా పనిచేస్తాం బ్రహ్మ తేజమూ క్షాత్ర వీర్యమూ భారత జాతిని నింపేస్తాం అలసట భీరుత లలవడనీయక జాతిని జాగృతి నింపేస్తాం పురాగౌరవం నవోత్తేజమూ పరంవైభవం సాధిస్తాం

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays