🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Madhava Nee Bhavya Charitamu

PatrioticVijaya Vipanchi7.5k plays
Languages:
Telugu
PDF
మాధవా నీ భవ్య చరితము స్ఫూర్తి నిచ్చును మాకు నిరతము నీదు పావన పాద స్పర్శతో పుడమి భారతి పులకరించెను నీదు దీక్షా దక్షతలతో కీర్తి నొందెను సంఘ చరితము అమరమైనది నీదు జన్మము అందుకొనుమా వందనములు తల్లి భారతి వైభవముకై పరితపించి, పరిశ్రమించి ధూమశకటమె నీదు గృహముగ మాతృభూమిని కలియ తిరిగిన అలసటెరుగని నీదు పయనము స్ఫూర్తినిచ్చును మాకు నిరతము మృదు మధురమౌ నీదు మాటల పాంచజన్యము పలకరించగ శతృవును మిత్రునిగ మార్చెడు నీదు సౌమ్యత మాకు బలముగ సంఘ గంగామృతము పంచగ దారి చూపిన దీపకళిక పెను తుఫానుల కెదురు నిలిచి సంఘ నావను దరికి చేర్చి నీదు శక్తితొ నీదు యుక్తితొ విస్తరించెను సంఘ కార్యము మాతృదేవి పదార్చనముకై నీదు రక్తము నీరు చేసిన చిరపురాతన నిత్య నూతన మాతృవైభవ గరిమ కొరకై శాఖయే నా దైవమనుచు సంఘటనయే సాధనముగా మాతృ అర్చనె నీదు వ్రతమై తల్లి భారతి తపము చేసిన

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays