మన దేశం మన ధర్మం మన సంస్కృతి ఒక్కటే
ఘన హైందవ జాతి రక్త మందరిలో ఒక్కటే
ఆవేశం ఆనందం అనుభూతి ఒక్కటే
ఏ వేషం భాషైనా భావ వాహినొక్కటే
అందరిలో గోవిందుని గాంచు తత్వమేదిరా
హిందు హిందు హిందు హిందు హిందుత్వమె మనది రా
బంధు భావ తరంగిణి మందాకిని ఏదిరా
హిందూ హృదయాంతరంగ నందనవనమిదేరా ||మన దేశం||
కేశవ ప్రేరిత పథమే మనకనుసరణీయం
మాధవ బోధిత మార్గమే మనకాచరణీయం
సంఘటనే మన లక్ష్యం సమన్వయం సాధనం
సహృదయం సద్భావం సమతే మన మూలధనం ||మన దేశం||