🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Manade E Pravahinche Nitya Samskruti

PatrioticVijaya Vipanchi5k plays
Languages:
Telugu
PDF
మనదే ఈ ప్రవహించే నిత్య సంస్కృతి మనదే సువిశాలమైన భవ్య భారతి హిమనగమ్ము సహస్రమై జాహ్నవి జాగృత ఝరియై బదరీ వనమె శిరమై మలయ శ్రేణియె కరమై పరమేశ్వరు శోభిల్లిన పవిత్ర పావన ధరలో హల్దీ ఘాటిలోని రాణా మయమైన ధూళి దేశభక్తి ప్రేరణకి రాజపుత్ర నివాళి సమర్థ చైతన్యానికి శివుని వెనుక మావళీ యుగయుగాల వైభవాలు మ్రోగించెను కాహళీ బ్రహ్మ మయము బ్రహ్మ పురము ప్రాగ్జ్యోతికి శ్రీకారం కోణారక రథములోన కాలచక్ర సంకేతం కటకు నుండి అటకు వరకు ప్రసరించే ఈ కాంతియె వేద సార జ్ఞానమునకు సత్య రూప ప్రకాశము సత్య అర్ధ ప్రకాశము సిరినగరం సింధూరం కేరళ పద మంజీరం కన్యాకుమారిలోన యోగిక మూలాధారం శబరిమలై జ్యోతులతో వెలిగించిన దీపాలకు మానసరోవరములోన సుధా సింధు సాకారం

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays