🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Matrumurthi Padala

PatrioticVijaya Vipanchi15k plays
Languages:
Telugu
PDF
మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం సాధనా పధమందు నిలచిన స్వయంసేవకులం మనం భారతిని సేవించుదాము భాగ్యమును సాధించుదాము ఎదను ఎదను తట్టి లేపి హైందవము రగిలించుదాము నవ్యయుగ నిర్మాణ పథమున సోదరుల నడిపించుదాము భవ్య భారతి దర్శనముకై నిత్య వ్రతమును సల్పుదాము ||మాతృమూర్తి|| పుష్పమాలలు పత్రదళములు పుణ్య జల అభిషేక కర్మలు చందనము కర్పూర హారతి తృప్తినీయవు మాతృమూర్తికి సింహ విక్రములై చెరించేడు లక్షలాదిగా శ్రేష్ఠ వ్యక్తుల కర్మమయ జీవనము నెగిసేడు తపోజ్వాలలు హారతియగా ||మాతృమూర్తి|| ద్రవ్యరాసులు సర్వ శక్తులు జ్ఞానశీల ప్రతాప గరిమల మాతృ పూజ మహా యగ్నపు హోమవేదిని ఆహుతిచ్చి దివ్య తేజపు కోటి కాంతులు తల్లి కన్నుల వెల్లివిరియగ వైభావన్విత విజయఘోషలు జగతి నింపగా ప్రతినబూని ||మాతృమూర్తి||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays